అన్ని దానాల కెల్ల విద్యాదానం గొప్పది -- మంత్రి దామోదర రాజనర్సింహ
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
సామాజిక స్పృహతో విరాళం ఇచ్చి అన్ని సౌకర్యాలతో కోన్నూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.వనపర్తి జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలోని మదనపూర్ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గానికి ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా పల్లె పోగు ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. వైస్ చైర్మన్ గా కే తిరుపతిరెడ్డి తోపాటు కమిటీ సభ్యుల చేతుల మీదుగా మార్కెట్ శాఖ అధికారి స్వరన్ సింగ్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రూ.2.18 కోట్ల వ్యయంతో నిర్మించిన కోన్నూరు33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభోత్సవం చేశారు. అదే గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఆరోగ్య సబ్ సెంటర్ ను ప్రారంభోత్సవం చేశారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు.


Comments