పోరాటాలే అమరులకు సరైన నివాళి

పోటు ప్రసాద్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం

పోరాటాలే అమరులకు సరైన నివాళి

 మోడీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యం 

అంబానీ, అదానీలకు దేశ సంపదను కట్టబెట్టే యత్నం

 పోటు ప్రసాద్ సంస్మరణ సభలో అమర్జిత్ కౌర్

WhatsApp Image 2024-12-08 at 10.20.22 PM

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు: ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ బహుముఖ పోరాటాలకు నేతృత్వం వహించి అమరులైన వారికి ప్రజా పోరాటాల కొనసాగింపే సరైన నివాళి అని ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ తెలిపారు. విద్యార్థి దశ నుంచి కార్మిక నాయకునిగా, కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పోటు ప్రసాద్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. గత నెల 27న మరణించిన సిపిఐ ఖమ్మంజిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ సంస్కరణ సభ ఖమ్మంలోని పాత మమత మెడికల్ కళాశాలలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ పోటు ప్రసాద్ కుటుంబం మూడు తరాల నుంచి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ వచ్చారని మూడో తరం వారైనా పోటు ప్రసాద్ విద్యార్థి ఉద్యమంలోనూ, కార్మిక ఉద్యమంలోనూ ఎంతో నిబద్ధతతో పని చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ శ్రేణులను ప్రజా పోరాటాలకు సన్నద్దం చేసేవారని కౌర్ తెలిపారు. పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఈ దశలో ప్రజా పోరాటాల ఉదృతి అవసరమని ఈ సమయంలో ప్రసాద్ మరణం యావత్ ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. మోడీ పాలనలో ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం పెరిగి వేతన జీవులు ఎగువ, దిగువ, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. దేశ సంపద ఒక శాతం మంది వద్ద పోగుపడుతుందని 90 శాతం మంది ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నారన్నారు. దేశ జనాభాలో యువకుల శాతం పెరుగుతూ యువ భారత్ గా మారుతుందని అదే సమయంలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అమర్జిత్ తెలిపారు. యువశక్తి నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగంలోని నియామకాలు లేవని ప్రభుత్వ రంగాన్ని మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తూ అంబానీ, అదానీలకు కట్ట బెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 25 శాతం మంది రోజు వారి కూలీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా పలు పోరాటాలు మొదలవుతున్నాయన్నారు.

సాంకేతిక విద్యతో పాటు వివిధ కోర్సుల్లో పేజీలు సాధించి ఉపాధి కోసం డిగ్రీలు చేతపట్టుకుని తిరుగుతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని సైతం మోడీ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని మూడు నూతన సాగు చట్టాలను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులు పెట్టారన్నారు. సుదీర్ఘ కాలం దేశ రాజధాని సరిహద్దుల్లో మిలిటెంట్ పోరాటం తర్వాత వెనక్కి తగ్గిన మళ్లీ దొడ్డిదారిన అమలు చేసేందుకు మోడీ పూనుకుంటున్నారని కౌర్ ఆరోపించారు. అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం హరించివేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో ప్రసాద్ లాంటి పోరాట యోధుడు మరణించడం దురదృష్టకర పరిణామమన్నారు. విద్యారంగాన్ని కాషాయికరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని కౌర్ పిలుపునిచ్చారు. 44 సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చానని మళ్లీ ఇటువంటి విషాద సమయంలో రావడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు.

 ప్రసాదు నివాళిగా శత వసంత ముగింపు సభ: కూనంనేని 

తుదిశ్వాస వరకు నిబద్ధత, నిస్వార్ధంతో కమ్యూనిస్టు పార్టీ పురోభివృద్ధికి కృషి చేసిన పోటు ప్రసాద్కు నివాళిగా సిపిఐ శత వసంతాల జాతీయ స్థాయి ముగింపు సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన అన్నారు. పోటు ప్రసాద్ సంస్మరణ సభలో కూనంనేని మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన

కుటుంబం నుంచి వచ్చిన పోటు ప్రసాద్ పార్టీ భావజాల వ్యాప్తిలో ముందు వరుసలో నిలిచారన్నారు. ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు పార్టీని 2

ఆదర్శంగా తీర్చిదిద్దడంలో పోటు ప్రసాద్ కృషి ఎనలేనిదన్నారు. త్యాగాన్ని సంపదగా మార్చుకున్న కుటుంబం వారిదని త్యాగాలకు, పోరాటాలకు ప్రతీకగా పోటు కుటుంబం మారిందని ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్న కమ్యూనిస్టులమని గర్వంగా చెప్పుకుంటారని కూనంనేని తెలిపారు. గంగినేని వెంకటేశ్వరరావు రచించిన ఎర్ర జెండాల పుస్తకంలోనూ, సుందరయ్య రచించిన ఆదర్శ కుటుంబాల పుస్తకంలోనూ పోటు ఎర్రమ్మ కుటుంబానికి సముచిత స్థానం ఇవ్వడం గర్వంగా ఉందని ఈ సందర్భగా సాంబశివరావు తెలిపారు. పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని కమ్యూనిస్టు భావజాలం సమస్యలు ఉన్నంత కాలం వ్యాప్తి చెందుతుంది తప్ప ఆగిపోదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ మావోయిస్టులను తుద ముట్టిస్తామని చెప్పడం అవివేకమేనని అది సాధ్యం కాదన్నారు. ప్రసాద్ మరణంతో ఓ విప్లవ గొంతుక మూగబోయిందని ప్రసాద్ స్పూర్తితో భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, మాజీ శాసన సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, గుమ్మడి నర్సయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, ఆంధ్రప్రదేశ్ సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వనజ, కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పర్షా

పద్మ, బాగం హేమంతరావు, బఏఎల్ నాయకులు పోట్ల మాధవరావు, జర్నలిస్టు సంఘాల నాయకులు కె. రాంనారాయణ, ఎ. ఆదినారాయణ తదితరులు ప్రసంగించగా గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్సి పోట్ల నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎస్, సాబీర్ పాషా, మహ్మద్ మౌలానా, బి. అయోధ్య, ప్రసాద్ కుమారుడు రాజా సాత్విక్, సతీమణి పోటు నిర్మల, తల్లి సక్కుబాయి, సోదరి. పోటు కళావతి, పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఎసికె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, కార్పొరేటర్ బిజి క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆలోచింపజేశాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .