మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత 

సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతల నివాళులు

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత 

ఉప్పల్,అక్టోబర్3(తెలంగాణ ముచ్చట్లు):

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అకాలమరణం తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్‌లోని కుటుంబ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కలిసి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు దామోదర్ రెడ్డి ప్రజా సేవలో చూపిన త్యాగం, కృషి తెలంగాణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
తదుపరి, రాజకీయ, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .