జిల్లెల్ల ఆదిత్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరాభిమాని రక్తంతో చిత్రపటం బహుమతి
మహబూబ్‌నగర్,అక్టోబర్1(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకుడు,ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ నేషనల్ హెడ్ (హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్) జిల్లెల్ల ఆదిత్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. పెద్దమండడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తన అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు.తన ప్రియతమ నాయకుడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమాభిమానంతో, గట్టు రాజు మహబూబ్‌నగర్ రక్తదాన కేంద్రంలో రక్తం దానం చేసి, తన రక్తంతో స్వయంగా కళాకారుడి సహాయంతో జిల్లెల్ల ఆదిత్య రెడ్డి చిత్రపటాన్ని గీయడం విశేషం. హైదరాబాదులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆ చిత్రాన్ని ఆదిత్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రేమాభిమానాల కానుకగా సమర్పించారు.గట్టు రాజు మాట్లాడుతూ..
జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు. ఆయన ప్రజాసేవా తపన, యువత పట్ల చూపించే ప్రేమ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా నా అభిమానాన్ని వ్యక్తం చేయడానికి నా రక్తంతో ఆయన చిత్రాన్ని గీయడం జరిగింది. ఇది నా హృదయపూర్వక గౌరవం అని తెలిపారు.జిల్లెల్ల ఆదిత్య రెడ్డి స్పందిస్తూ..
ఇలాంటి అభిమానులు నా బలమూ, నా ప్రేరణా. రక్తంతో గీసిన నా చిత్రపటం నాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. గట్టు రాజు చూపిన ప్రేమను నేను ఎప్పటికీ మరిచిపోలేను” అని తెలిపారు.పుట్టినరోజు వేడుకలో హైదరాబాదులో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గట్టు రాజు గీసిన ప్రత్యేక చిత్రపటం అక్కడి నాయకుల్లో విశేష ఆకర్షణగా నిలిచింది.


Comments