సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనల పై ప్రత్యేక చర్చ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

 -- పాల్గొన్న పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభాలు, శంకుస్థాపనలపై త్వరలోనే వనపర్తికి రానున్న ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి గారితో వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి గారు ఆదివారం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారు  నియోజకవర్గ పరిధిలో  చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించిన అంశాలతో పాటు, విద్య వైద్యం వ్యవసాయం సాగునీరు లాంటి తదితల అంశాలపై కీలకంగా చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ ప్రత్యేక భేటిలో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి  పాల్గొని పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న ఉద్యోగ మేళా, రుణమేళకు సంబంధించిన  అంశాలపై చర్చించారని ఎమ్మెల్యే తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  వనపర్తి నియోజకవర్గానికి వచ్చే  తేదీని త్వరలోనే ప్రకటించనున్నామని ఎమ్మెల్యే చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .