పానీ పూరీ – మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ సభకు ఎంహెచ్పిఎస్ పూర్తి మద్దతు
మైస ఉపేందర్ మాదిగ
ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
హైదరాబాద్,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):
రాజధాని హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆగస్టు 20న మధ్యాహ్నం రెండు గంటలకు “పానీ పూరీ – మార్వాడీ గో బ్యాక్” ఉద్యమ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యమ నాయకుడు, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి నాయకత్వంలో ఈ సభ జరగనుంది.
ఈ సందర్భంగా మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చి ఆర్థిక పరిపుష్టి సాధించిన ఉత్తరాది మార్వాడీలు స్థానికులపై ఆధిపత్యం ప్రదర్శించడం, దాడులు చేయడం అంగీకారయోగ్యం కాదని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఆస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా ఈ ఉద్యమ సభ మొదటి అడుగని ఉపేందర్ మాదిగ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి తెలంగాణ వర్తక సంఘాలు, స్థానిక వ్యాపారులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలు తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


Comments