సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి 

వనపర్తి కoటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే దయానంద్ ముదిరాజ్

సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి పట్టణం లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో బుధవారం  వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ సందర్శించారు. ముందుగా విద్యార్థులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వసతి గృహాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మెస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కానీ ఇప్పటి కి అమలు కాని కొత్త మెను.ఇది ప్రభుత్వ మెను లో  ఇడ్లి, చపాతీ, పూరీ  తో ఇతర వంటలను మెనూ లో చేర్చారు. కానీ దానికి అనుకులా శిక్షకులైన వంట పనివారు లేరు.ఇదీ అమలు కావాలంటే వర్కర్స్ సంఖ్యా పెంచాలి. సరైన వంట పాత్రలను ఏర్పాటు చేయాలి. డిస్టిక్ ప్రైజ్ కమిటీ ప్రకారం మెను ఏర్పాటు చేస్తున్నారు.గురుకులాలకు ఇచ్చిన్నట్లు టెండర్ విధానం ఏర్పాటు చేస్తే బాగుoటుంది అంటున్న సంబంధిత అధికారులు.సంక్షేమ హాస్టల్లో పెండింగ్ బిల్లు లను విడుదల చేయాలి.పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ ఉద్యోగుల జీతాలను పెంచి సకాలం లో జీతాలు చెల్లించాలి. అకాడమీ గడుస్తున్న ఇంత వరకు విద్యార్థులకు అందని సదుపాయాలు.28 రకాలకు వస్తువులకు టెండర్లు వేసిన  ఇంతవరకు అమలు కాని పరిస్థితి.చలి కాలం లో  బెడ్ షీట్స్, రగ్గులు, క్యాప్స్, స్టడి ఛైర్స్ వంటివి అందక ఇబ్బoదులు.. జిల్లా అధికారి మల్లికార్జున్ తో చరవాని ద్వారా వివరణ కోరిన కoటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్.సకాలంలో అందిస్తామంటున్న అధికారులు తెలిపారు.పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి కాస్మోటిక్ చార్జెస్ పెంచడం అభినందనీయం. కాని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం,అధికారులు విద్యార్థులకు అందే దిశగా ముందుకు సాగాలని కోరారు.త్వరలో వనపర్తి నియోజకవర్గంలో వసతి గృహాల్లో రాత్రి బస చేస్తామని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థులకు  భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని గమ్యం దిశగా క్రమ శిక్షణ తో ముందుకు సాగాలనీ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .