మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్టూర్ చెరువులో చేప పిల్లల వదిలింపు

మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్టూర్ చెరువులో చేప పిల్లల వదిలింపు

చేపల పెంపకంలో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

— మత్స్యశాఖ అధికారులు భరత్, వీరేష్

పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):aa

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని గోపాల సముద్రం చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల వదిలింపు కార్యక్రమం నిర్వహించారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మత్స్యశాఖ అధికారులు భరత్, వీరేష్ ఈ సందర్భంగా తెలిపారు.ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందించిన రెండు లక్షల 67 వేల (2,67,000) చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందని వారు వివరించారు.దీని వల్ల చెరువులో మత్స్య సంపద పెరిగి, రానున్న కాలంలో చేపల దిగుబడి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. మత్స్యశాఖ అమలు చేస్తున్న పథకాలను మత్స్యకారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ..గ్రామాభివృద్ధిలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చెరువుల సంరక్షణతో పాటు చేపల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే గ్రామానికి మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు.మత్స్యకారులకు గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామ మత్స్యకార సొసైటీ  అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ.. మత్స్యశాఖ సహకారంతో సబ్సిడీ ద్వారా చేప పిల్లలు అందించడం మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ ఉపాధ్యక్షులు సతీష్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు గ్రామ మత్స్యకారులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వెల్టూర్ లో వారాంతపు కూరగాయల సంతకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అశోక్  వెల్టూర్ లో వారాంతపు కూరగాయల సంతకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అశోక్ 
పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై వారాంతపు కూరగాయల సంత ఏర్పాటు అంశంపై చర్చించారు. చాలాకాలంగా గ్రామంలో...
సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
ముగ్గులు మన సంస్కృతికి ప్రతీక పనగట్ల చక్రపాణి గౌడ్
జయగిరిలో సంక్రాంతి సంబరాలు.
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు
కీసరలో ఘనంగా 205వ వారం జ్ఞానమాల కార్యక్రమం