ఉపాధ్యాయ వృత్తి బాధ్యతాయుతమైనది
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
భావి తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి ఎస్ సి.-2024లో నియామక ఉత్తర్వులు పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ కొరకు నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల స్థాయి నుండి విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, మంచి అలవాట్లు, నడవడిక అందించి వారి భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి బాధ్యతాయుతమైదని అన్నారు. డి ఎస్ సి.-2024లో నియమితులైన ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, విద్యార్థులతో మమేకమై వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తూ ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో 288 పోస్టులు ఖాళీ ఉండగా 248 మంది అర్హత సాధించారని, కౌన్సిలింగ్ కార్యక్రమానికి 230 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments