ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు
జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి,అక్టోబర్6(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాస్వామ్య పరిరక్షణలో, కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకు వ్యతిరేకంగా గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ..దేశంలో ఒక పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసి, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందని చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. ఒక్క పార్టీ ఓట్లను దోచి అధికారంలోకి రావడం ప్రజల హక్కుపై దాడి.త్వరలో ఎన్నికలు జరిగే బీహార్‌లో రాహుల్ గాంధీ ఆధారాలతో ఓటు చోరీ జరిగిందని చూపించారు. ఎన్నికల సంఘం కానీ, ఆ పార్టీ కానీ నిజాన్ని తేల్చలేకపోయారు.తెలంగాణలో 2018 ఎన్నికల్లో ఈవీఎం లో మార్పులు జరిగాయని స్పష్టమే. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నా ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఇది ఓటు దొంగతనానికి స్పష్ట సూచిక.ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వంత అభిప్రాయాన్ని దొంగిలించడం, ఇది మాకు పెద్ద ముప్పు.రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర చేపట్టి ప్రజలను చైతన్య పరచడంతో బీహార్‌లో కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించబడింది. ఇది ప్రజల విజయం.గ్రామంలో కార్యకర్తలతో కలిసి వంద సంతకాల సేకరణ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పద్ధతిలో సంతకాల సేకరణ జరగాలి.గ్రామంలో వంద సంతకాల సేకరణ విజయవంతం అయింది. రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణకు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అన్ని సంతకాలు 15 తేదీకి రాష్ట్ర అధ్యక్షకార్యాలయానికి పంపబడతాయి. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు,
చీర్ల జనార్ధన్ జిల్లా ప్రధాన కార్యదర్శి,రోహిత్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు,రాగి అక్షయ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్,ఎత్తం చరణ్ రాజ్ మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు,జోగు శాంతన్న మాజీ సర్పంచ్సీనియర్ నాయకులు,హరిబాబురెడ్డి, ధర్మారెడ్డి, మెంటే పల్లి రాములు, ఎంట్ల రవి, కొండన్న, విజయ్, గోవర్ధన్, వెంకటేష్, లోకేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బాలేశ్వర్, బండలయ్యా, బొజ్జయ్య యాదవ్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..jpeg)


Comments