శ్రీ ఆదర్శ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Views: 3
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ ఆట, పాటలతో సంతోషంగా గడిపారు. బతుకమ్మ వేడుకలు ఆవశ్య కత గురించి పాఠశాల కరస్పాండెంట్ బోడెపుడి కిరణ్ విద్యార్థులకు వివరించారు. వేడుకలు అనంతరం బతుకమ్మలను సమీపంలోని వాగులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయినీలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments