ఘనంగా శరన్నవ రాత్రి ఉత్సవాలు
Views: 3
On
కాజిపేట్ తెలంగాణముచ్చట్లు
కాజీపేట నగరంలోని రహమత్ నగర్ వెంకటేశ్వర కాలనీలో పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతిరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం. కావ్య , సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ. శ్రీనివాస్ , కార్పొరేటర్ జక్కుల. రవీందర్ లు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాక. వేద ప్రకాష్, సాయి ,రాజిరెడ్డి, ప్రకాష్, రాజేష్ కుమార్, నాగుల కృష్ణ ,ఉదయ్, రెడ్యా నాయక్ ,వెంకట్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments