రవాణా రంగంపై వేధింపులు తగ్గించాలి
కేంద్ర మంత్రి నితిన్ గడకరిని కలిసిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్

ఓవర్‌లోడ్ నుండి నెలవారీ మామూళ్లను అక్రమంగా వసూలు
పెంచిన ఫాస్ట్ ట్యాగ్ రుసుమును తగ్గించండి
ఢల్లీ,తెలంగాణ ముచ్చట్లు:
రవాణా రంగంలో నానాటికి వేధింపులతో పాటు పెరుగుతున్న ధరలు, ఇంకా వేధింపులు తదితర అంశాలపై చర్యలు తీసుకొని రవాణా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి అక్బర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రం సమర్పించినట్టు రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ మీడియాకు తెలిపారు.కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలుసుకున్న తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అక్బర్ కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో పలు ముఖ్యమైన అంశాలను పేర్కొంటూ కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో లోడ్ లారీ డ్రైవర్లను వేధించడం, ఎక్కువ మొత్తంలో వసూళ్లు చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి దృష్టికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఇప్పటికే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కష్టాలతో రవాణా రంగం కుదిలైందని, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితమే ట్యాగ్ రుసుము ఎక్కువగా పెంచడం వల్ల రవాణా రంగంలో లారీలు నడవాలంటే అతి కష్టంగా నిర్వహణ భారం అవుతుందని పేర్కొన్నారు. రవాణా రంగం ప్రస్తుతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నధని తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద అక్రమ వసూలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.మహారాష్ట్రలో కూడా లారీల వద్ద సంబంధిత ఏజెంట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారనీ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. చెక్ చెక్ పోస్ట్ యొక్క నియమాలు మరియు నిబంధనలు అమలుకోవడం లేదని క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. ఉస్మానాబాద్‌లోని ఓమర్గా చెక్‌పోస్టు వద్ద పరిస్థితి క్లిష్టంగా ఉందని ఓవర్‌లోడ్ నుండి నెలవారీ మామూళ్లను తెలంగాణ లారీల వద్ద అక్రమంగా వసూలు చేస్తున్నరని పేర్కొన్నారు.గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం పెంచిన ఫాస్ట్ ట్యాగ్ రుసుమును వెంటనే తగ్గించాలని అలాగే డీజిల్, ఫాస్ట్ ట్యాగ్, ఇన్సూరెన్స్, టైర్లు మొదలైనవాటికి ప్రభుత్వం అత్యధిక పన్నులు పెంచినట్లు చెప్పారు.వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంలో దయతో తమ రవాణా రంగాన్ని చూడవలసిందిగా అభ్యర్థించినట్టు తెలిపారు.మానవతా దృక్పథంతో ఈ విషయంపై పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. అనవసరంగా ఉన్న చెక్ పోస్ట్‌లను మూసివేసి రవాణా రంగం కష్టాలను తగ్గించాలని కోరారు.


Comments