డార్క్ చాక్లెట్ రోజూ తింటున్నారా..? అయితే మీకు అన్ని లాభాలే..!

 డార్క్ చాక్లెట్ రోజూ తింటున్నారా..? అయితే మీకు అన్ని లాభాలే..!

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

నొప్పులను తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారాలు మేలు చేస్తాయి. చలికాలంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల కూడా UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల వృద్ధాప్య ప్రభావాలను కూడా తగ్గించుకోవచ్చు.
 డార్క్ చాక్లెట్ అంటే దాదాపు అందరికీ ఇష్టమే. ఈ చాక్లెట్ కోకో బీన్స్‌తో తయారు చేస్తారు. సాధారణ చాక్లెట్‌తో పోలిస్తే, డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, కాపర్, ఫ్లేవనాయిడ్స్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. చలికాలంలో డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. గ్రీన్ టీ కంటే డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.. మంట, నొప్పిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్ తీసుకోవడం ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఎంత యాంటీ ఆక్సిడెంట్లు తీసుకుంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. యాంటీఆక్సిడెంట్లను తీసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .