డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి 

-రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ ఆర్.వి. కర్ణన్

డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి 

 ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శుక్రవారం కమీషనర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ నియంత్రణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోను డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని, డెంగ్యూ నియంత్రణ పై వైద్య ఆరోగ్య శాఖతోపాటు స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రై డే కార్యక్రమాల వల్ల దోమల వృద్ధిని అరికట్ట వచ్చన్నారు. పరీక్షలు పెంచాలని, పాజిటివ్ వచ్చినచో, సంబంధికులు, చుట్టుప్రక్కల నమూనాలు సేకరించడం, నియంత్రణ చర్యలు చేపట్టడం చేయాలన్నారు. ఫీవర్ సర్వే రెగ్యులర్ గా చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటుచేసి, గ్రామాల్లో, వార్డుల్లో ఇంటింటికి తిరగడం, ప్రజల్లో అవగాహన కల్పించడం చేయాలన్నారు. నీరు నిల్వ లేకుండా చూడడం, యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టడం చేయాలన్నారు. వచ్చే 2-3 నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డెంగ్యూ తో బాధపడేవారికి ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటుచేసి, చికిత్స అందించాలన్నారు. వార్డులో 24 గంటలు వైద్యాధికారి అందుబాటులో ఉండి, ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సేకరించే నమూనాలు టి హబ్ కు, ప్రయివేట్ ఆసుపత్రుల నమూనాలు ఐడిఎస్పి ల్యాబ్ లకు పరీక్షలు చేయించాలని అన్నారు. ప్లేట్లెట్ కౌంట్ పై ప్రజల్లో భయం పోగొట్టి తగు చికిత్స అందించాలని అన్నారు. ప్లేట్లెట్, బ్లడ్ సరిపోవునంతగా అందుబాటులో ఉండేట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో శానిటేషన్ పై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. కావాల్సిన మందులకు ఇండిట్ పంపాలన్నారు. మంజూరు పోస్టులు భర్తీ చేయాలన్నారు. 

     అంతకుముందు కమీషనర్ కూసుమంచి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రెఫరల్, అంబులెన్స్, డెలివరీ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఇడిడి లు వివరాలు అడిగి, రెగ్యులర్ గా పర్యవేక్షణ చేస్తున్నది అడిగారు. ల్యాబరేటరీ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయుష్ ఓపి రోజువారి ఎంతమంది వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. డెలివరీలు పెంచాలని, గర్భిణులకు రెగ్యులర్ చెకప్ అయ్యేలా చూడాలని, మెరుగైన సేవలు అందించి నమ్మకం పెంచాలని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకై పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.  

     జిల్లా ప్రధాన ఆసుపత్రిని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ జిల్లా కలెక్టర్ తో కలిసి తనిఖీ చేశారు. రేడియాలజీ కేంద్రాన్ని పరిశీలించి, ఎంతమంది టెక్నీషియన్లు ఉన్నది, ఎన్ని పరీక్షలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. మామోగ్రఫి చేపడుతున్నది, ఎన్ని కేసులు చేసింది అడిగారు. పరీక్షల రిజిష్టర్ పరిశీలించారు. టీ హబ్ కేంద్రాన్ని పరిశీలించారు. డెంగ్యూ పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుండి రోజువారి వస్తున్న పరీక్షల శాంపిల్స్, ఏ ఏ పరీక్షలకు ఎక్కువగా శాంపిల్స్ వస్తున్నది, టి హబ్ లో ఎన్ని రకాల పరీక్షలు చేపడుతున్నది, ఎంత వ్యవధిలో పరీక్షా ఫలితాలు అందజేస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

     అనంతరం దానవాయిగూడెం లో క్షేత్ర స్థాయిలో పర్యటించి డ్రై డే కార్యాచరణ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని, నీటి నిల్వలో దోమలు వృద్ధి చెందుతాయని, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు రాకుండా స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలని, వ్యాధులు వచ్చిన చోట వెంటనే చికిత్స అందించి, వ్యాపించకుండా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కమీషనర్ అన్నారు. 

     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం జిల్లాలో డ్రై డే ను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. స్లమ్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, వైద్య శిబిరాలు నిర్వహించడం చేయాలన్నారు. ప్రజల్లో సీజనల్ వ్యాధులపై అవగాహనకు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. 

   ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, డిటీసీఓ డా. సుబ్బారావు, ఇంచార్జ్ జెడ్పి సిఇఓ నాగలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. సైదులు, డా. సీతారాం, ప్రోగ్రామ్ అధికారులు డా. చందు నాయక్, డా. రామకృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డా. రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .