సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలి
--వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో సీజనల్ వ్యాధుల నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు జిల్లాలో ఎక్కడ నమోదు అయిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో పాజిటివ్ కేసు నమోదు అయినా వెంటనే జిల్లా వైద్య అధికారి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి పేరు, సేల్ నెంబర్, పూర్తి చిరునామా గ్రూప్ లో పెట్టాలని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులతోపాటు చుట్టూ పక్కల జ్వరం సర్వే చేయడం, రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించడం జరగాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, అధికారులు పాజిటివ్ వచ్చిన ఇంటికి చేరుకొని దోమల వ్యాప్తి ఎక్కడి నుండి జరుగుతుంది అనేది పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులను బయటకు పంపించి పైరత్రియం స్ప్రే చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో నమోదు అయిన పాజిటివ్ కేసులు జిల్లా వైద్య శాఖకు తెలిస్తేనే నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జ్వరం తో వచ్చే ప్రతి ఒక్కరి నుండి రక్త నమూనాలు సేకరించి డయగ్నోస్టిక్ కొరకు ఎలిజా సెంటర్ కు పంపించాలని సూచించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ మొత్తంలో వైద్య ఖర్చులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య రేటు తెలిపే సూచిక బోర్డులు ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద పెట్టాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ లు అధిక సంఖ్యలో జరుగుచున్నాయని వీటిని కట్టడి చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పని చేసే మహిళా డాక్టర్లకు, మహిళా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ భద్రత కలిస్తుందని తెలియజేశారు. రాత్రి వేళల్లో పనిచేసే చోట ఒక కానిస్టేబుల్ ను ఉంచేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కలిగిన నూతన ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, డయజ్ఞస్టిక్ సెంటర్లకు జిల్లా కమిటీ ద్వారా ఆమోదము
కొత్తగా ఆసుపత్రులు, డయజ్ఞస్టిక్ సెంటర్లు, క్లినిక్ లు , పాత వాటికి రెన్యువల్ కోరుచు ఆన్లైన్ ద్వారా పెట్టుకున్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పరిశీలించింది.
దరఖాస్తులో నిబంధనల ప్రకారం సమర్పించిన డాక్యుమెంట్లు, ఫోటోలు పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న వాటికి కమిటీ ద్వారా ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం లేని వాటిని తిరస్కరించింది.
జిల్లా వైద్య అధికారి డా. జయచంద్ర మోహన్, అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్, డా. సాయినాథ్ రెడ్డి, పి హెచ్.సి ల మెడికల్ డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments