20మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎంపీ రఘురాo రెడ్డి
Views: 4
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి లభిదారులకు పంపిణీ చేశారు. శుక్రవారం కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు స్వయంగా అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ రఘురాo రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ.. తమ ప్రభుత్వo నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుతో అందరికీ మేలు జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments