మెరుగైన వైద్య సేవలతో ప్రజల్లో నమ్మకం పెంపొందించాలి
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
మెరుగైన వైద్య సేవలతో ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం కలెక్టర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతాశిశు ఆర్యోగ కేంద్రం ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటి, ఫార్మసీ, వార్డులు పరిశీలించారు. గర్బిణిలు, క్యాజువల్ వైద్య పరీక్షలకు వచ్చిన గర్బవతులు, రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఇడిడి ల వివరాలు అడిగి, రెగ్యులర్ గా పర్యవేక్షణ చేస్తున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు. ల్యాబరేటరీ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు.
డెలివరీలు పెంచాలని, గర్భిణులకు రెగ్యులర్ చెకప్ అయ్యేలా చూడాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎంతమంది టెక్నీషియన్లు ఉన్నది, ఎన్ని పరీక్షలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. మామోగ్రఫి చేపడుతున్నది, ఎన్ని కేసులు చేసింది అడిగి తెలుసుకున్నారు. పరీక్షల రిజిష్టర్ కలెక్టర్ తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రోజుకు సరాసరి పేషంట్ల వివరాలు, ఏ ఏ వైద్యసేవలు అందిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రకాల వైద్యపరీక్షలు, స్కానింగ్ లు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నది, ఇడిడి రిజిష్టర్ నిర్వహణ గురించి ఆరా తీసారు. సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని, గర్భిణులకు ముందస్తుగా సాధారణ ప్రసవాలకు చేపట్టాల్సిన చర్యలపై చైతన్యం తేవాలన్నారు. వైద్యాధికారులు, రోగులు, రోగుల సహాయకులతో ఆసుపత్రి సేవల గురించి వివరించి, వారికి విశ్వాసం పెంచాలన్నారు. ఆసుపత్రిలో సమస్యలు, కావాల్సిన సౌకర్యాలకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ వచ్చే వారితో ప్రేమపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన సేవలు అందించాలని అన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జర్వాలతో బాధపడేవారికి ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటుచేసి, చికిత్స అందించాలన్నారు. వార్డులో 24 గంటలు వైద్యాధికారి అందుబాటులో ఉండి, ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భణి స్త్రీలు సాధారణంగా వైద్యపరీక్షలకు వచ్చిన వారికి ఒత్తిడిని జయించే శక్తి కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేటిషన్ రూమ్ ను కలెక్టర్ సందర్శించారు. గర్బిణిలకు ఏనిమిది సార్లు ప్రక్రియ విధానంను డాక్టర్లు ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ కాన్ఫుల వార్డు, ఐసియు, ఇన్ బోర్న్ యూనిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, అమృతం తల్లిపాల కేంద్రం, తల్లిపాలను సేకరించి, నీల్వ ఉంచే కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. టాయిలెట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డా. రాంబాబు, వైద్యాధికారులు, తదితరులు ఉన్నారు.


Comments