పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలి
-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్, మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మధిర నియోజకవర్గ మండలాల ఎంపిడిఓ లు, ఎంపిఓ లతో పారిశుద్ధ్యం పై సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీలు శుభ్రంగా వుండేలా, నీరు ఆగకుండా ప్రవహించేలా వుండేలా చూడాలన్నారు. ఖాళీ ప్లాట్లు, ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు, పొదలు శుభ్రం చేయాలని, నీటి నిల్వలు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. డెంగ్యూ, జ్వరాలు వచ్చిన చోట, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని, అన్ని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో మధిర నియోజకవర్గ ఎంపిడిఓ లు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.


Comments