త్వరలో రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు...

త్వరలో రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. 

ఈ కార్డుల జారీకి ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతి, హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల వివరాల వంటి అంశాలన్నింటినీ పరిశీలించి కార్యాచరణ సంసిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. 

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలతో పాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .