తండ్రీ, కూతురు గల్లంతయిన ఘటనలో కూతురి మృతదేహం లభ్యం.

తండ్రీ, కూతురు గల్లంతయిన ఘటనలో కూతురి మృతదేహం లభ్యం.

మరిపెడ : వరదల్లో ఖమ్మం జిల్లాకు చెందిన తండ్రీ, కూతురు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని వరద ప్రవాహంలో గల్లంతు అయిన విషయం తెలిసేందే. మ‌హ‌బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి కారు నీటిలోకి కొట్టుకుపోయింది. అయితే.. తమ కారు వాగులోకి కొట్టుకుపోయిందని, తమను ర‌క్షించాలంటూ వారు బంధువులకు ఫోన్ చేశారు.వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఉద‌యం నుంచి గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. కాగా మ‌ధ్యాహ్నం నూనావత్ అశ్విని అశ్విని మృత‌దేహం ల‌భ్య‌మైంది. బ్రిడ్జికి కొద్ది దూరంలో జామాయిల్ చెట్ల మ‌ధ్య మృత‌దేహం చిక్కుకుంది. ఇక తండ్రి నూనావత్ మోతిలాల్ ఆచూకీ కోసం పోలీసులు, రెస్య్యూ టీం సిబ్బంది గాలింపు చేప‌డుతున్నారు. వాగులో తండ్రీ కూతురు గ‌ల్లంత‌వ‌డం, కూతురు విగ‌త‌జీవిగా లభ్య‌మ‌వ‌డంతో విషాదం అలుముకున్నది. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .