గట్లఖానాపురం , బుగ్గపల్లి తండాలో రెండు డెంగ్యూ కేసులు నమోదు
- శానిటేషన్ చేసి వైద్య సేవలు అందించిన సిబ్బంది - ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి - పిహెచ్‌సి వైద్యాధికారి మంజుల
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల పరిధిలోని గట్లఖానాపురం, బుగ్గపల్లి తండాలో రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు జిల్లా అదనపు మలేరియా అధికారి శ్రీనివాస్ జి తో పాటు వైద్య సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లి డెంగ్యూ తో బాధపడుతున్న వారిని రక్షించి వైద్య సేవలు అందించారు. వారి నుంచి రక్తనమూనాలు సేకరించారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇండ్లకు సమీపంలోని 500 మీటర్ల పరిధిలోపల అన్ని నివాస గృహాలకు పైరేత్రియం స్ప్రే పిచికారి చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారిణి మంజుల మాట్లాడుతూ.... ప్రజలు డెంగ్యూ బారినపడకుండా దోమలు పుట్టకుండా చూసుకోవాలని ఇంటి పరిసరాలలో వర్షపు నీరు ఎక్కువ రోజు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్లాస్టిక్ డబ్బాలు, కొబ్బరి బోండాలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పిహెచ్‌సి సూపర్‌వైజర్ ఓం ప్రకాష్, తదితరులు ఉన్నారు.


Comments