సనాతన ధర్మాన్ని కాపాడుటకై హైందవులు క్షేత్రపాలకులుగా ముందుండాలి

సనాతన ధర్మాన్ని కాపాడుటకై హైందవులు క్షేత్రపాలకులుగా ముందుండాలి
నిరసన ర్యాలీ చేస్తున్న హైందవ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు

హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన వారిని కటినంగా శిక్షించాలని హసన్‌పర్తి నగర హైందవధర్మపరిరక్షణ  ప్రముఖులు గురుమూర్తి  భద్రదేవ్ ఆద్వర్యంలో హసన్‌పర్తి జాతీయరహాదారి యందు నిరసన కార్యక్రమం చేప్పట్టారు.ఈ కార్యక్రమానికి హసన్‌పర్తి మండల ప్రముఖ పురోహితులు దహగం రమేష్ శర్మ  హాజరై మాట్లాడుతూ అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన వారెవరైన ప్రభుత్వం తక్షణమే కటినంగా శిక్షించాలని అన్నారు.హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరగడం బాధాకరమని, ఆలయాల సంరక్షణకై  హైందవసోదరులు క్షేత్రపాలకులగా ఉండాలని, భరతభూమిలో భారతీయ సంస్కృతి,సంప్రదాయ ఆచార వ్యవహార విలునలని కాపాడుకోవడం భారతపౌరుల కర్తవ్యమని,దేశద్రోహులని క్షమించరాదని ద్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో నగర పురోహితులు వేదాంతం సంపతాచార్యులు గురుమూర్తి గురుదత్తు,కాజీపేట వెంకటస్వామి,హసన్‌పర్తి పెద్దమ్మతల్లి ఆలయ అర్చకుడు శ్రీనివాస్,హసన్‌పర్తి రాజరాజేశ్వరి ఆలయం చైర్మన్ కందుకూరి చంద్రమోహన్, కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .