కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమ్మినేపల్లి- పండితాపురం గ్రామం లో ఇంటింటి సర్వే 

పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మల్లి బాబు యాదవ్ 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమ్మినేపల్లి- పండితాపురం గ్రామం లో ఇంటింటి సర్వే 

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ లో గత వారం రోజుల నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సర్వే కార్యక్రమంలో అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారిని, పెన్షన్ రాని వారిని, ఇల్లు లేనివారిని మరియు గ్రామంలోని వివిధ రకాల సమస్యలను గుర్తించడం జరుగుతుంది. శుక్రవారం నాడు జరిగిన సర్వే కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ 

 2006లో ఇలాంటి ఇందిర సర్వే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలోని లబ్ధిదారులను గుర్తించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని నాటి సుజాతనగర్ ఎమ్మెల్యే కీర్తిశేషులు రాo రెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి, వారి సహకారంతో గ్రామంలోనే కాకుండా కామేపల్లిమండల వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా వందలాది మందికి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు కొత్త పెన్షన్, కొత్త ఇల్లు మంజూరు కాలేదని, 10 సంవత్సరముల పాటు జిల్లాలోనే అతిపెద్ద ఆదాయ వనరులు ఉన్న కొమ్మి నేపల్లి పంచాయతీ నిధులను అధికారులు దుర్వినియోగపరిచారని, కామేపల్లి మండలంలో కాస్తో కూస్తో అభివృద్ధి అయిందంటే అది కేవలం కోరం కనకయ్య వల్లనే సాధ్యపడిందని, మళ్లీ ఇప్పుడు చేపట్టిన సర్వే రిపోర్ట్ ను ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్య కి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి నివేదించడం జరుగుతుందని, సమస్యల్ని పరిష్కరించడానికి ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి పేదలకు న్యాయం జరుగుతుందని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గాని, 2004ముందు ఉన్న ప్రభుత్వంలో గాని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సర్వే కార్యక్రమమును పకడ్బందీగా నిర్వహిస్తున్న సర్వే టీం ను అభినందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సర్వే గురించి ప్రశ్నించగా సర్వే చాలా బాగుందని, ఇన్నాళ్లు మేము దరఖాస్తులు పెట్టుకుంటే ప్రయోజనం లేకుండా పోయిందని, మా సమస్యల్ని ఇంటింటికి వచ్చి తెలుసుకొని గతంలో కూడా పరిష్కరించడం జరిగిందని, తప్పక మాకు ఈ సర్వే ద్వారా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య, గుగులోతు రవి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాదు, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, కొమ్మి నేపల్లి మత్స్య శాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ భానోత్ నరసింహ నాయక్, మేకల మహేష్ బాబు, బద్దల శేఖర్,జక్కంపూడి వెంకటేశ్వర్లు చల్ల నాగేశ్వరరావు బద్దల వీరబాబు, ఉబ్బని నాగార్జున, తిమ్మట్ల అనిల్ కుమార్ ఉబ్బని ఉపేందర్, పల్లపు ప్రతాప్ కుమార్, భూక్య శ్రావణ్ కుమార్, బండి నాగరాజు,బండి ఎల్లయ్య, మేకల లక్ష్మీనారాయణ, రాయల నాగ శంకర్ బాదావత్ నాగరాజు, డేరంగుల తిరపయ్య, తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .