నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు

నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

 ఖIMG-20241005-WA0015మ్మం పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని, ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం రాపర్తి నగర్ 58వ డివిజన్ లో టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ. కోటి 10 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేసారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,58వ డివిజన్ పెద్ద డివిజన్ అని, కొత్త కాలనీలు, ఇంటి నిర్మాణాలు వస్తున్నందున అవసరమైన రోడ్డు, డ్రైన్, మొదలగు మౌళిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దొరైకాలనీలో మౌళిక వసతుల కల్పన కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామని, వీటిని స్థానిక అవసరాలకు వినియోగించాలని మంత్రి సూచించారు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ముందు పనులు చేయాలని మంత్రి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులు పది కాలాల పాటు ఉండే విధంగా చూడాలని, ప్రస్తుతం వేసే రోడ్లు, డ్రైయిన్లు నాణ్యతతో ఉండాలని, లెవెలింగ్ సరిగ్గా ఉండాలని అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో మురికి నీరు వచ్చి, దోమలు, పందులు ఉండటం వల్ల జబ్బులు వస్తాయని అన్నారు. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి భూమి లెవెలింగ్ చేసి, నీరు నిలవకుండా చూడాలని, అక్కడ చెత్త లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని, ఖాళీ స్థలాల్లో మురికి తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, సదరు స్థలం ఓనర్లతో శుభ్రం చేయించాలని అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగి, ప్రజలు ఆశించినప్పుడు మాత్రమే రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, అభివృద్ధికి మారు పేరు తుమ్మల అని, ఖమ్మంలో ఎక్కడ ఏం చేయాలో సంపూర్ణ అవగాహన ఉన్న నాయకులని అన్నారు. వంద మందికి ఉపయోగపడే పనులను మంత్రి తప్పనిసరిగా చేస్తారని అన్నారు. డ్రైయిన్ పనులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, మిగిలిన రోడ్డు, డ్రైయిన్ పనులు చేపడతామని, ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఖమ్మం పట్టణాన్ని పచ్చదనంగా, పరిశుభ్రంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద వచ్చిన రూ. 100 కోట్ల అభివృద్ధి నిధుల్లో 58వ డివిజన్ పనులకు రూ. కోటి 10 లక్షలు మంజూరు అయ్యాయని, వర్క్ ఆర్డర్ ఇచ్చామని, 2 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, 2 నెలల కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో 58వ డివిజన్ కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, 75 శాతం రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశామని, పెండింగ్ రోడ్డు నిర్మాణ పనులు, 80 శాతం పైగా పెండింగ్ ఉన్న డ్రైయిన్ పనులు పూర్తి చేసేందుకు మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సీహెచ్. స్వామి, ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .