నిజాయితీగా కష్టపడితే విజయం తథ్యం

నిజాయితీగా కష్టపడితే విజయం తథ్యం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు: 

IMG-20241003-WA0038ర్వజ్ఞ విద్యార్ధులతో ముఖాముఖిలో ఐ ఎ ఎస్ అధికారి సురేంద్ర మోహన్ రాష్ట్ర మైనింగ్, శాండ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేస్తూ ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా ఖమ్మం వచ్చిన సందర్భంగా కొద్ది సేపు సర్వజ్ఞ విద్యార్థులతో కెరీర్ ప్లానింగ్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి భవిష్యత్తు ప్రణాళికలను ఎర్పరుచుకోవలని దానికి అనుగుణంగా కష్టపడాలని సూచించారు. అధ్యాపకులు చెప్పిన అంశాలను మరియు వారు నేర్పిన వివిధ రకాల అంశాలను జాగ్రత్తగా నేర్చుకోని వివిధ అంశాలపై సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో టెక్నాలజీ ని తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని దానిని దుర్వినియోగం చేయకూడదని తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన, ఆరాటం, కసి వుండాలని ఎట్టి పరిస్థితులలో లక్ష్యాన్ని సాధించడంలో వెనుకంజ వేయకూడదని ఆయన తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు వెళ్ళేవారు మాత్రమే విజేతలుగా మిగులుతారని ఆయన తెలిపారు. సాధారణ కుటుంబం నుండి ఇంతటి ఉన్నత స్థితికి రావడానికి తామెంత కృషిచేసింది, కష్టపడింది వివరించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ విద్యార్ధులకు మంచి ఉజ్వల భవిష్యతు అందిస్తున్న సర్వజ్ఞ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఈ మధ్య నిర్వహించిన వివిధ క్రీడా పాటిల్లో జిల్లా మరియు రాష్ట్రస్థాయిలలో విజేతలుగా నిల్చిన సర్వజ్ఞ విద్యార్థులకు మెమొంటోలను అందచేసి వారిని అభినందించారు. చదువుతో పాటే క్రీడలలో కూడా ఇంత మంచి ప్రతిభను కనబరుస్తున్న సర్వజ్ఞ విద్యార్థులను, అధ్యాపకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్వజ్ఞ డైరెక్టర్స్ ఆర్వి. నాగేంద్ర కుమార్, నీలిమ గార్లు మరియు టౌన్ ప్లానింగ్ అధికారి ఇటుకలా భాస్కర్ మరియు ప్రిన్సిపాల్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .