ఖమ్మంలో లేజర్ మ్యూజికల్ ఫౌంటేన్ ఎగ్జిబిషన్ ప్రారంభం  

ముఖ్యఅతిథిగా మేయర్ పూనుకొల్లు నిరజ

IMG-20240929-WA0007పండగ సందర్భంగా ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన లేజర్ షో ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను నగర మేయర్ పూనుకొల్లు నిరజ ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా పండగ సందర్భంగా పిల్లలకు , పెద్దలకు , యువతకు అన్ని వయసుల వారికి ఆహ్లాదం కలిగించే విధంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం సంతోష్కరంగా ఉందన్నారు . పట్టణ ప్రజలు సాయంకాలం వేల కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంతో గడపాలని కోరారు . ఈ సందర్భంగా నిర్వాకులు బాలశౌరి , అప్పిరెడ్డి , అచ్చయ్య లు మాట్లాడుతూ 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలియజేశారు . ఈ ఎగ్జిబిషన్లో అద్భుతమైన లేజర్ ఏర్పాటు చేయబడిందని దీనితోపాటు ఎంటర్టైన్మెంట్ కోసం 80 ఫీట్ల జాయింట్ వీల్ , బెంగళూరు పాలిసే 100 అడుగుల ముఖద్వారం , మేరీ కొలంబస్ , బ్రేక్ డాన్స్ , డ్రాగన్ ట్రైన్ , క్రాస్ వింగ్ తో పాటు అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కమర్తపు మురళి , పాలెపు వెంకటరమణ , బుడిగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .