2024 జులై నెల (ఎఫ్ వై 2024-25) వరకు భారత ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
భారత ప్రభుత్వ నెలవారీ ఖాతాలను జులై 2024 వరకు క్రోడీకరించిన తర్వాత ఒక నివేదిక రూపంలో విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు:
* భారత ప్రభుత్వానికి 2024 జులై వరకు రూ.10,23,406 కోట్ల రాబడి వచ్చింది. (2024-25 బడ్జెట్ రాబడి 31.9%).
* ఈ మొత్తం రాబడిలో పన్నుల ఆదాయం (కేంద్రం నికర రాబడి) రూ.7,15,224 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ.3,01,796 కోట్లు.
* రుణభారంలేని మూలధన ఆదాయం రూ.6,386 కోట్లు.
* పన్ను రూపేణా భారత ప్రభుత్వానికి వసూలైన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా రూ.3,66,630 కోట్లను తిరిగి రాష్ట్రాలకు చెల్లించారు. ఇది గత ఏడాది కన్నా రూ.57,109 కోట్లు అధికం.
_భారత ప్రభుత్వ వ్యయం రూ.13,00,351 కోట్లు (2024-25 బడ్జెట్ అంచనాలో 27%). దీనిలో రెవిన్యూ పద్దు కింద రూ.10,39,091 కోట్లు, మూలధన పద్దు కింద రూ.2,61,260 కోట్లు ఖర్చయ్యాయి. వడ్డీ చెల్లింపులకు రూ.3,27,887 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.1,25,639 కోట్లు ఖర్చయ్యాయి._


Comments