మాంగో డిబి సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా యస్.బి.ఐ.టి. కి గుర్తింపు

మాంగో డిబి సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా యస్.బి.ఐ.టి. కి గుర్తింపు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మాంగో డిబి తమ కళాశాల యస్.బి.ఐ.టి.ను సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా గుర్తించిందని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలియచేశారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో సంస్థ ప్రతినిధుల నుండి సంబందిత పత్రాలను అందుకున్నట్లు వారు తెలిపారు. ఎక్స్టెన్సీ కేంద్రంగా గుర్తింపు పొందటం ద్వారా తమ కళాశాల విద్యార్థులకు సంస్థచే ఆధునిక కోర్సులను అందించటంతో పాటుగా ఉద్యోగ అవకాశాలకు ప్రముఖ కంపెనీలు విచ్చేసే అవకాసం ఉందని వారు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఐ.సి.టి. అకాడమీ వారి సహకారంతో నిర్వహించిన మాంగో డిబి కోర్సులను తమ విద్యార్థులు మెరుగుగా ఉపయోగించుకోవటంతో పాటు అద్భుత ప్రతిభను కనబరచి నందుకు గాను తమ కళాశాలకు ఈ గుర్తింపు దక్కిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్టాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. డేటాబేస్ రూపురేఖలను మార్చిన మాంగో డిబి వంటి ప్రఖ్యాత సంస్థలతో అనుసంధానం కావడం తమ కళాశాల విద్యార్థులకు సదవకాశం అని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. రోజు రోజుకు పెరిగిపోతున్న డేటాను ఉపయోగించుకునే విధానాలపై శిక్షణ పొందటంతో ఉద్యోగ అవకాశాలలో రాణించవచ్చని వారు అభిప్రాయ పడ్డారు.

ఈ కార్యక్రమంలో మాంగో డిబి సంస్థ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ బసవాదర్శన్, జగన్నాధన్, ఐ.సి.టి. అకాడమీ సి.ఈ.ఒ. వి. శ్రీకాంత్, తెలంగాణా హెడ్ బి. గోపాల్, రిలేషన్ షిప్ మేనేజర్ యస్.కె. గౌస్పషా, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, డా॥ కె. స్థూర్తి, టి.పి.ఒ. యస్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .