పకడ్బందీగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ -సిఎం రేవంత్ రెడ్డి 

 

 

 

 

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పైలెట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. 

కార్డుల ప్రక్రియకు సంబంధించి ఒ

క అర్బన్, ఒక రూరల్ ప్రాతిపదికన ప్రాంతాల ఎంపిక పూర్తయిందని అధికారులు వివరించారు.

అక్టోబర్ 3 నుంచి 7 వ తేదీ వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని చెప్పారు.

రేష‌న్ కార్డు, పింఛ‌ను-స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ‌, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా ఇప్ప‌టికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌యింది.

పైIMG-20240930-WA0016లెట్ ప్రాజెక్టులో వాటిని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను చేర్చడంతో పాటు కుటుంబంలో ఎవరైనా మృతి చెందింతే అలాంటి వారిని తొల‌గిస్తామ‌ని అధికారులు వివ‌రించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .