ఈ అంశానికి సినీ ప్ర‌ముఖులు ముగింపు ప‌లికితే మంచిది 

టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌

ఈ అంశానికి సినీ ప్ర‌ముఖులు ముగింపు ప‌లికితే మంచిది 

 

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై సినీ ప్ర‌ముఖుల ఆగ్ర‌హం.

ఇప్ప‌టికే మంత్రి త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌ సంహ‌రించు కున్నారన్న టీపీసీసీ చీఫ్.*

ఇరువైపులా మ‌హిళలు ఉన్న విష‌యాన్ని సినీ ప్ర‌ముఖులు గుర్తించాల‌ని విజ్ఞప్తి.

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

మంత్రి కొండా సురేఖ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అవి తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్య‌ల‌ని, వాటిని ఉప‌సంహరించుకున్నట్లు సురేఖ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. దీనిపై మీడియాతో చెప్పడంతో పాటు ఎక్స్ వేదిక‌గా కూడా మంత్రి పోస్టు పెట్టార‌ని తెలిపారు. 

అందుకే సినీ ప్ర‌ముఖులు ఈ అంశానికి ముగింపు ప‌ల‌కాల‌ని కోరారు. మ‌హిళ‌ల ప‌ట్ల కేటీఆర్ చిన్న‌చూపు ధోర‌ణిని ప్ర‌శ్నించడం త‌ప్పితే.. ఎవ‌రి మ‌నోభావాల్నీ దెబ్బ‌తీయ‌డం త‌న ఉద్దేశం కాద‌ని సురేఖ పేర్కొన్న‌ట్లు మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరువైపులా కూడా మ‌హిళలు ఉన్న విష‌యాన్ని సినీ ప్ర‌ముఖులు గుర్తించాల‌ని కోరారు.

మంత్రి కొండా సురేఖ‌పై కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఓ సోద‌రికి ఓ సోద‌రుడిగా నూలుపోగు దండ వేసిన విధానాన్ని ట్రోల్ చేయ‌డం జ‌రిగింది. దీన్ని సినిమావాళ్లు కూడా చూసి ఉండొచ్చు. దీంతో ఆ మ‌హిళ ఎంత బాధ‌ప‌డ్డారో ఆలోచించండి. బేష‌ర‌తుగా సురేఖ త‌న వ్యాఖ్య‌ల్ని ఉప‌సంహ‌రించుకున్నారు. ఇక‌పై కాంగ్రెస్ నేత‌లు, మంత్రులు మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి" అని మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .