తెలంగాణ పండుగలను కాపాడుకుందాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ పండుగలను కాపాడుకుందాం

*తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

ప్రIMG-20241009-WA0012కృతిలో లభించే పూలను పేర్చి దేవుడిగా కొలిచే తెలంగాణ పండుగ “బతుకమ్మ”ను సంతోషంగా జరుపుకొని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకకు సతీమణితో కలిసి హాజరై పూజలు చేసి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ పండుగలలో 'బతుకమ్మ'కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రకృతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గౌరవించి, పూజించే విధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ శాస్త్రీయ పండుగలను వేడుకగా జరుపుకొని భావితరాలకు అందించాలని అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలో పాల్గొన్న వారిలో కలెక్టరేట్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారికి ప్రథమ బహుమతి, ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ వారికి ద్వితీయ బహుమతి, జిల్లా సంక్షేమశాఖ వారికి తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వి రాములు, హరికృష్ణ, భూ సేకరణ ప్రత్యేక అధికారి డి చంద్రకళ, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .