మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు పున:ప్రారంభం

పరిశీలించిన తుంబూరు దయాకర్ రెడ్డి

మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు పున:ప్రారంభం

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

IMG-20241005-WA0038ద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు పున: ప్రారంభం అయ్యాయి. ఆ పనులను కొబ్బరికాయ కొట్టి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం పునః ప్రారంభించారు. అనంతరం పెండింగ్ పనులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత బాధ్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధబాబు, డైరెక్టర్ పంతులు నాయక్, మద్ది మల్లా రెడ్డి, మౌలానా, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కె.వి. చారి, తమ్మినేని నవీన్, అంబటి సుబ్బారావు, నల్లపునేని కౌశిక్, గురునారాయణ, అంజయ్య, బాణోతు కిశోర్ నాయక్, ఆరెంపుల రామయ్య, బాణోతు హరి, వెంకట నారాయణ, గుడిచుట్టు వెంకన్న తదితరులున్నారు. తదనంతరం వార్తా కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లెక్స్ దుకాణాన్ని ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జివిమాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .