మండలంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-
మం
డలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో, మండల తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. మండలంలోని అందుగులపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు డిఆర్డిఏ పిడి కిషన్, ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జ్ కడారి జీవన్ కుమార్ లు హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామసభ నిర్వహించి, ఉపాధి హామీ పథకం పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పనుల ప్రారంభానికి పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి వీరేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్, కరబారి మధు, గ్రామ పెద్దలు, చాంద్ పాషా, రేగుంట రాజయ్య, చిల్ల పోషం, గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీ లు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పొన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు పంచాయతీ కార్యదర్శి హరీష్, ఎంపివో అత్తర్, టిఏ రాజమల్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య లు హాజరై, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ 2025-2026 బడ్జెట్ ప్రణాళిక సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కారోబార్ భానుచందర్, అంగన్వాడి టీచర్, గ్రామ ఉపాధి హామీ కూలీలు తిరుపతి, గుర్రం మంజుల, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments