శాంతి, అహింసలను ప్రపంచానికి చాటిన మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

IMG-20241002-WA0020

 

 

 

తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

శాంIMG-20241002-WA0021 తి, అహింసలను ప్రపంచానికి చాటిన మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర ఉద్యమంలో అహింస, సత్యాగ్రహంతో మహాత్మా గాంధీ ముఖ్యపాత్ర పోషించారని, సహాయ నిరాకరణ, స్వదేశీ వస్త్రధారణ లాంటి అహింస మార్గాలతో స్వాతంత్రం కోసం పోరాటం చేశారని తెలిపారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస మార్గాలను తాను స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలిచారని, గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పిన బాపూజీ మాటలు ఆచరిస్తున్నామని అన్నారు. మహనీయులు చూపిన మార్గాలు ఆచరణ నీయమని, ప్రతి ఒక్కరు వారి ఆశయాలు పాటించాలని తెలిపారు. ఇలాంటి మహనీయుల చరిత్ర, త్యాగాలను భావితరాల వారికి అందించి వారు చూపిన మార్గాన్ని అనుసరించి దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .