ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు

ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు

 

సిద్ధిపేట,తెలంగాణ ముచ్చట్లు:

సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు.పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్‌ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వగా.. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొంది చదువుతుంది.ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారని జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చినందుకు ఇది సాధ్యమైందని తండ్రి రామచంద్రం తెలిపాడు.కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబీబీఎస్‌ చదువుతున్నారని, ప్రత్యేక తెలంగాణ వల్లే ఇది సాధ్యమైందని పిల్లలతో రామచంద్రం, శారద దంపతులు హరీష్ రావును కలిశారు.నలుగురు ఎంబీబీఎస్‌ సీట్లను పొందడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని హరీష్ రావు పిల్లలను అభినందించాడు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .