ఝాన్సి రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి
Views: 15
On
హైద్రాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి నియోజక వర్గం,తొర్రూరు పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ తో కలిసి వెళ్ళిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి.కాసం షాపింగ్ మాల్ ముందు ఏర్పాటుచేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వేదిక ఒక్కసారే కుప్పకూలగా ఝాన్సీరెడ్డి కాలుకు తీవ్ర గాయం కాగా హుటాహుటిన హైద్రాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించిన విషయం తెలిసిందే.అందులో భాగంగానే విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపి రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి అపోలో హాస్పిటల్ కు వెళ్ళి ఆమెను పరామర్శించారు.వారి వెంట ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments