మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజి పట్టించుకోని అధికారులు
కలుషితమవుతున్న మిషన్ భగీరథ మంచి నీరు
పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవట్లేదని ఆవేదన
తాటికాయల గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం
తాటికాయల గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా మిషన్ భగీరథ ఏఈ ఉండడం గమనార్హం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని తాటికాయల గ్రామ ఎస్సి కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజి అయి మంచి నీరు కలుషితమవుతుంది.గత కొన్ని నెలలుగా లీకేజి అవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే సీజనల్ వ్యాధులు,వైరల్ ఫీవర్స్ బాధపడుతున్నమని,ఇలా మంచి నీరు కూడా కలుషితమయి మరిన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని,పలుమార్లు పంచాయితీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా మిషన్ భగీరథ ఏఈ ఉండడం గమనార్హం.స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని,ఇక మా గోడు వినేది ఎవరని వాపోతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.


Comments