77 వసంతాల 78వ స్వాతంత్య్ర దినోత్సవం
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
న్యూ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద నేడు జరిగే భారతదేశ 77 వసంతాల 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం ఇతివృత్తం వికసిత్ భారత్ -2047. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పునరుత్తేజాన్ని అందించడానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను చూసేందుకు సుమారు 6 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. యువకులు, గిరిజనులు, రైతులు, మహిళలు, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సహాయంతో వివిధ రంగాలలో రాణించిన వారు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments