మహిళలపై జరుగుతున్న దారుణాలు మన దేశ శాంతి, అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయి

-జమాఅతె ఇస్లామి హింద్ మహిళా విభాగం ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్‌

మహిళలపై జరుగుతున్న దారుణాలు మన దేశ శాంతి, అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

దేశంలో స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సమాజంలో నైతిక విలువ లోపించడమే కారణమని జమాఅతె ఇస్లామి హింద్ మహిళా విభాగం ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నైతికతే నిజమైన స్వేచ్ఛ’ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా జరిగే జాగృతి ఉద్యమంలో భాగంగా జమాఅతె ఇస్లామీ హింద్ ఖిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు అజీజ్ గల్లి లో స్థానిక కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దారుణాలు మన దేశ శాంతి, అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయి. ఈ ఘోరాలకు మూలకారణం నైతిక విలువల లోపం. సమాజంలో నైతిక విలువల లోపించడం వల్ల మహిళలపై లైంగిక హింస, బలాత్కారాలు, కుటుంబ వ్యవస్థ విఘాతం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే, ఒక కులం లేదా మతాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో ప్రేరేపితమైన రాజకీయ కుట్రలు, వాటి ప్రభావం కూడా దీనికి కారణమవుతుంది. నేరస్తులను హీరోలుగా భావించడం, వారి నేరాలను క్షమించడం, వాటిని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి ఇలాంటి దారుణాలు పెరుగడానికి దోహదం చేస్తున్నాయి అన్నారు. జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా విభాగం ‘నైతికతే నిజమైన స్వేచ్ఛ’ అనే అంశంతో నెల రోజులు నిర్వహించే ఉద్యమంలో మహిళలకు అసలైన స్వేచ్ఛ అంటే ఏమిటి? అది నైతికతతో ఎలా అనుసంధానమైందో అవగాహన కల్పిస్తామని నైతిక విలువలను అనుసరించడం ద్వారా మాత్రమే నిజమైన శాశ్వత స్వేచ్ఛ, జీవితంలో తృప్తిని పొందగలరని అన్నారు. అలాగే, భ్రమలతో కూడిన స్వేచ్ఛ భావనలలో చిక్కుకుపోయి అనైతిక ప్రవర్తనకు బానిసలుగా మారిన వారికి విముక్తి కల్పించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యమని ఆమె అన్నారు. అనంతరం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్ మాట్లాడుతూ క్యాంపెయిన్ లో భాగంగా నైతిక స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి కరపత్రాల ద్వారా వివరిస్తామని అన్నారు. నైతిక విలువల్ని ప్రోత్సహించే పలు వీడియో సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించడానికి మహిళలకు మరియు కాలేజీ విద్యార్థినిలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, విద్యార్థినిలు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా మాజి మహిళా అధ్యక్షురాలు సైదా భాను, మహిళా సభ్యులు, ఆమీనా , నస్రీన్‌, ఆమిరా, షాజియ , ,సీమ అతహర్‌, షాహెదా సుల్తానా , అఫ్‌రోజ్‌, సమినా, అయిషా , సుమయ్య, పర్‌జానా , సీమ మహిళాలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .