జిల్లాలో పశు గణనను పకడ్బందీగా చేపట్టాలి 

-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్

జిల్లాలో పశు గణనను పకడ్బందీగా చేపట్టాలి 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

జిల్లాలో పశు గణనను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. 21వ జాతీయ పశుగణన ను పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21వ అఖిల భారత పశుగణన 1 సెప్టెంబర్, 2024 నుండి 31 డిసెంబర్, 2024 వరకు చేపట్టి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 589 గ్రామ పంచాయతీలలో, 4 పట్టణ ప్రాంతాలు కలిపి మొత్తం 999 ఆవాస ప్రాంతాల్లో సమగ్ర పశుగణన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకుగాను 380 రెవెన్యూ గ్రామాలకు 150 మంది ఎన్యుమరేటర్లు, 40 మంది సూపర్వైజర్లను నియమించినట్లు ఆయన అన్నారు. పశుగణన ఎంతో కీలకమైనదని, సమన్వయంతో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయాలన్నారు. పశువుల గణన సరైన ప్రణాళిక, పశుసంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి, ఈ రంగంలో మరింత అభివృద్ధి ని సాధించడానికి ఈ ప్రధాన సమాచారం మూలమని అన్నారు. దీనివలన పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు, పశువులకు సంబంధించిన మందులు ప్రభుత్వం సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే పాడి రైతులకు సంక్షేమ పథకాలు అమలుచేయడానికి ప్రభుత్వానికి ఖచ్చితమైన అవగాహన కల్గుతుందన్నారు. శిక్షణ ను సద్వినియోగం చేసుకొని పశుగణన ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.

      కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. బి. వేణుమనోహర రావు మాట్లాడుతూ, చివరి పశుగణన అంటే 20వ పశుగణన 2019 లో నిర్వహించినట్లు, వచ్చే సెప్టెంబర్ నుండి 21వ పశుగణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలు, ఇతర పశువుల వివరాలను సేకరిస్తారని తెలిపారు. పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు ఎన్యుమరేటర్లకు వివరాలు తెలియజేసి సహకరించాలన్నారు. 

    కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డా. సుబ్బారావు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డేటా సేకరణ, పశుజాతులు, గణన పై అవగాహన కల్పించారు.

 ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు డా. రాధాకిషన్, డా. శ్రీరమణి, డా. అరుణ, డా. రాజు, పశువైద్యులు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .