కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారo హత్యను ఖండిస్తున్నాo
-ఖమ్మం డిస్టిక్ బార్ అసోసియేషన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం డిస్టిక్ బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రెస్క్లబ్లో* వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్యను తాము ఖండిస్తున్నామని ప్రస్తుతం డాక్టర్లు చేస్తున్న విధుల బహిష్కరణ ర్యాలీని తాము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో డాక్టర్స్ ఏ నిర్ణయం తీసుకున్న తామంతా వారికి సపోర్ట్ గా ఉంటూ వాళ్లతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే విధంగా అక్కడే కొందరు వ్యక్తులు ప్రయత్నించారని అయితే హైకోర్టు ఈ విషయమై సంబంధిత అధికారులకు చివాట్లు పెట్టి సిబిఐకి కేసును *అప్పగించిందని ఈ విషయంలో అక్కడి సీఎం మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని, మమత బెనర్జీ రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పత్రిక ముఖంగా ఆయన తెలియజేశారు. అసలైన నిందితులను తప్పించడానికి కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
తాము ర్యాలీని నిర్వహించబోతున్నట్లుగా పేర్కొన్నారు. త్వరలో తమ బృందం కలకత్తా వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసి పరామర్శించి, ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తమ బృందం కలకత్తా వెళ్లబోతున్నట్లుగా వెళ్లేముందు ప్రెస్ కు తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుగ్గాల వెంకటేశ్వర గుప్తా న్యాయవాదా పరిషద్ ఖమ్మం, డిస్ట్రిక్ట్ సెక్రటరీ
తాళ్లూరి దిలీప్ చౌదరి , సహస్ర వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ,
పసుపులేటి శ్రీనివాస్ ,మాజీ పబ్లిక్ ప్రాసెక్యూటర్
రుద్రాక్ష దుర్గారని , విస్తరణ హిందూ పరిషద్ ఉమెన వింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.


Comments