సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూత

సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూత

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

సిపిఎం అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరి తిత్తులలో ఇన్ పెక్షన్ తో గత నెల 19 నుండి డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన మృతితో కమ్యూనిస్టు వర్గాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతారాం ఏచూరి అంచెలంచెలుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. 1992 నుండి ఆయన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా పని చేస్తున్నారు..2005 నుండి 2017 వరకు పార్లమెంటులో రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఆయన అకాల మృతి పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా సిపిఐ, సిపిఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .