సైబర్‌ నేరగాళ్లు కాదు..సైబర్‌ బందిపోట్లు!

ఏఐ ఆధారిత సైబర్‌ నేరాలతో మరింత ముప్పు.. 

సైబర్‌ నేరగాళ్లు కాదు..సైబర్‌ బందిపోట్లు!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 * బ్యాంకు ఖాతాల్ని కాదు.. డబ్బు సీజ్‌ చేయాలి

* వ్యక్తిగత భద్రతలాగానే ఆన్‌లైన్‌ భద్రత కూడా

* ప్రజల వివరాలన్నీ ఆన్‌లైన్‌ అంగట్లో అమ్మకానికి

* ‘సోషల్‌’ వేధింపుల బారినపడుతున్న యువత

* కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి

* సైబర్‌ కేటుగాళ్ల బారిన పడ్డ నష్టపోయినవారు గంటలోగా ఫిర్యాదు చేస్తే ఎక్కువ ప్రయోజనం

* సీఆర్‌సీఐడీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌ వెల్లడి

నానాటికీ గణనీయంగా పెరుగుతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజల్లో వాటిపై అవగాహన, అప్రమత్తత ముఖ్యమని.. సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌) వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల తెలిపారు. ఏఐ, డీప్‌ ఫేక్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో సైబర్‌ నేరగాళ్లు మున్ముందు మరింత పెద్ద ఎత్తున మోసాలకు తెగబడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులను మోసం చేసి వారి పదవీ విరమణ ప్రయోజనాలను దోచుకుంటున్నవారిని కేవలం ‘సైబర్‌ నేరగాళ్లు’ అంటే సరిపోదని.. వారిని ‘సైబర్‌ బందిపోట్లు’గా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .