సర్వజ్ఞలో పాఠశాలలో హిందీ దివస్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
సెప్టెంబర్ 14 నా స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞా పాఠశాలలో హిందీ దివాస్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్, నీలిమ మాట్లాడుతూ దేశ అధికార భాషగా హిందీని స్వీకరించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం హిందీ దివస్ ను జరుపుకుంటారని తెలియజేశారు. మన జాతీయ భాష(నేషనల్ లాంగ్వేజ్) గా పేరుగాంచిన "హిందీ" భాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. ఇందుకు గల కారణం 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి ఈ తేదీని హిందీ దివస్ గా జరుపుకోవడం ఆనవాయితీ. అధికారిక భాష హిందీ దేవ నాగరిక లిపి నుంచి రూపొందించబడింది. హిందీ అంటే "పర్షియన్ కానుక" అని అర్ధం. మనం గమనించినట్లయితే శుద్ధ హిందీ(ప్యూర్ హిందీ) భాషను రేడియోలలో, టి.వి. వార్తలలో వినవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయబడింది. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా ఉంది. అయితే... మనలో చాలా మందికి తెలియని విషయం ఏటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం, ఇది మనం అందరం గర్వించదగిన విషయం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే వాడేవారు. ఈ భాషను "లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి" అనేవారు. అంత గొప్పది మన హిందీ భాష, అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని..! కాబట్టి హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య లేకుండా జీవించ వచ్చన్నమాట. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను సెప్టెంబర్ 14, 1949న భారతదేశ అధికారిక భాషగా స్వీకరించారు. మొదటి హిందీ దివస్ సెప్టెంబర్ 14, 1953న నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీని దేశ అధికార భాషగా స్వీకరించినందుకు గుర్తుగా హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే ఈరోజు హిందీ భాష ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. యువ తరాలను హిందీ మాట్లాడేలా ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష హిందీ, ఇంగ్లీష్ లా కాకుండా హిందీని నేర్చుకోవడానికి సులభమైన భాషగా వర్ణిస్తారు. ముఖ్యంగా ఆంగ్ల భాష ఇప్పుడు తరచుగా ఉపయోగించే అనేక పదాలు, హిందీ పదాలనుంచి స్వీకరించినవే. అవతార్, బందన్న, డింగీ, గురు, యోగా, జంగిల్, ఖాకీ, కర్మ, లూట్, మంత్రం, నిర్వాణ, పైజామా, సోర్బెట్, టైఫూన్ వంటి పదాలు హిందీ నుంచి తీసుకున్న కొన్ని ఇంగ్లీష్ పదాలకు ఉదాహరణలు. ప్రతి విద్యార్థి హిందీ భాష మీద పట్టుదల సాధించాలని సూచించారు. హిందీ భాష ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పాఠశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపల్స్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.


Comments