భారతదేశం అన్ని మతాలకు నిలయం

సీఐ జి వేణు

భారతదేశం అన్ని మతాలకు నిలయం

శాంతియుత వాతావరణం లో పండుగలు జరిగించుకోవాలి

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు

భారత దేశం అన్ని మతాలకు నిలయం

ప్రతి మతాన్ని అందరూ గౌరవించాలి

వినాయక చవితి పండుగకు నిబంధనల ప్రకారం హైందవ సహోదరులు అందరు సహకరించాలి

స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు

వచ్చే నెలలో వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని స్థానిక స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ నందు సిఐ. జి. వేణు, స్టేషన్ ఘనపూర్ మండలానికి సంబంధించిన హిందువులు ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి సిఐ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు నిలయం కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి సాంప్రదాయాలలో పండుగలు ప్రతి ఒక్కరు గౌరవించాలని ముందు జరగబోయే పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిబంధనలకు అనుకూలంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోని, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి మండపాల విషయాలలో ఖచ్చితమైన పర్మిషన్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరు పాటించాలని దీనికి అన్ని మతాలవారు మాకు సహకరించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు రహమతుల్లా, మహమ్మద్ సమీర్, ఎండి దస్తగిరి మసూక్. పాస్టర్ తాటికొండ బాలస్వామి, మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు దేవవరం, సింగపురం రాజు, సింగపురం నాగయ్య జీడి రమేష్, మద్దపురం కిషోర్, తాటికొండ వెంకటస్వామి, సత్యనారాయణ రెడ్డి, రాజేష్, రాజు. తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .