నేడు ప్రధాని వాయనాడ్ పర్యటన డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు:
కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీ క్షించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించడం, బాధిత ప్రజలను కలవ డంతోపాటు ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులు, బాధితుల కుటుంబాలను కూడా ఆయన కలుసుకుంటారు._
* ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకుని, వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.
* మధ్యాహ్నం 12.15 గంటలకు, కొండచ రియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు.
* విపత్తు దెబ్బతిన్న ప్రాంతంలో పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 2,000 కోట్ల సహాయం కోరింది.
* హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృ త్వంలోని కేంద్ర బృందం విపత్తు ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి, బాధిత ప్రజలతో మాట్లాడారు..
* వాయనాడ్ కొండచరియల ప్రభావం భారీగా ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం అవసరమని అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం తెలిపింది.


Comments