దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ
---పెద్దమందడి మాజీ జడ్పిటిసి వెంకటస్వామి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల కేంద్రంలో మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని మొట్టమొదట మన భారతదేశానికి ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన రాజీవ్ గాంధీ అని అన్నారు . ఆర్థికంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుక వచ్చిన నటువంటి వ్యక్తి మన రాజీవ్ గాంధీ. గ్రామపంచాయతీలకు రాజీవ్ గాంధీ హయాంలోనే నిధులను కేటాయించడం జరిగిందని రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి బుచ్చన్న , పెద్దలు పుల్లన్న , మాజి స్కూల్ చైర్మన్ సూర్య రవి , ప్రవీణ్ కుమార్ రెడ్డి టిఎంఆర్ నాయకులు రాఘవేందర్, గట్టు రాజశేఖర్ చెన్న కేశవులు వందల బాలకృష్ణయ్య , మైనార్టీ నాయకులు జావిద్ , సూర ప్రభాకర్ , ఆర్టీసీ డ్రైవర్ జయరాములు , సత్యనారాయణ కురుమూర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments