ఖమ్మం ఫోటోగ్రాఫర్ సంపత్ కు రాష్ట్రస్థాయి అవార్డులు

ఖమ్మం ఫోటోగ్రాఫర్ సంపత్ కు రాష్ట్రస్థాయి అవార్డులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు: 

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఐదు విభాగాల్లో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో ఖమ్మానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ తీసిన ఫోటోలు మహాలక్ష్మి , రైతు భరోసా రెండు విభాగాల్లోనూ రాష్ట్రస్థాయి అత్యుత్తమ ప్రతిభా పురస్కారం, మెమెంటోలు లభించాయి. ఈ పోటీల్లో రాష్ట్ర లోని పలు జిల్లాలకు చెందిన వందలాది మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో 

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. 

రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సంపత్ కుమార్ అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో

రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .