వైద్యురాలి పై ఆత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
• మౌనిత కుటుంబానికి న్యాయం చేయాలి • శిక్షలు వేయడంలో జాప్యం చేయడం వల్లే నేరాలు పెరుగుతున్నాయి --జిల్లా మహిళా సాధికారిక కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ శ్రీ వాణి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
కోల్‌కతాలో ఐదు రోజుల క్రితం వైద్యారాలిపై అత్యాచారం,హత్య ఘటనను వనపర్తి జిల్లా మహిళా సాధికారిక కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ,విద్యార్థిని మౌనిత కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీవాణి డిమాండ్ చేశారు. నిందితులకు శిక్షలు వేయడంలో జాప్యం జరగటం వలన నేరాలు అధికంగా పెరిగిపోతున్నాయని అన్నారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఆఖరికి ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. ఎలా అయితే పోలీసులకు,లాయర్లకు , ప్రభుత్వ ఆఫీసర్లకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్లకు మరియు ప్రభుత్వ శాఖలకు అనుసంధానంగా 24/7 విధులు నిర్వహించే ప్రతి శాఖకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.


Comments